హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఎంపీ జన్మదిన వేడుకలు

కృష్ణా: మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి జన్మదిన వేడుకలను అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అవనిగడ్డ నియోజకవర్గ అభివృద్ధికి ఎంపీ బాలశౌరి విశేష సహకారం అందిస్తున్నారని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ ఛైర్మన్ యలవర్తి చిన్నా, ఎంపీటీసీ భాను తదితరులు పాల్గొన్నారు.