కృష్ణా: పెడన టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ప్రజాదర్బార్ నిర్వహించారు. నియోజకవర్గ నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వ్యక్తిగత, స్థానిక సమస్యలపై వినతిపత్రాలను స్వీకరించారు. బాధితుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే


