హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సైబర్ నేరాల పట్ల విద్యార్థులకు అవగాహన

NTR: వీరులపాడు (మం) జగన్నాథపురంలో సైబర్ నేరాలపై విద్యార్థులకు ఎస్సై అభిమన్యు శుక్రవారం అవగాహన కల్పించారు. విద్యార్థులు చదువుకునే వయస్సులో సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికలను జాగ్రత్తగా వినియోగించాలని, సైబర్ మోసాల పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.