హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రణాళికాబద్ధంగా పారిశుద్ధ్య నిర్వహణను చేపట్టాలి'

నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ దేవరకొండ సుజాత అశోక్ నగర్‌లో శుక్రవారం పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా 53వ డివిజన్ వారధి సెంటర్ ప్రాంతంలో  ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను మేయర్ ఆదేశించారు. డివిజన్ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణను అత్యంత ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని సిబ్బందికి సూచించారు.