ELR: ఉంగుటూరు హైస్కూల్లో శుక్రవారం స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, విద్యార్థుల నుంచే స్వచ్ఛత అలవాటు కావాలని ఇంచార్జ్ జెడ్పీ సీఈఓ, DPO మల్లికార్జునరావు పిలుపునిచ్చారు. చెత్తను తడి, పొడి, ప్రమాదకర వ్యర్థాలుగా వేరు చేసి వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మనోజ్, తహసీల్దార్ సన్యాసిరావు, రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఉంగుటూరులో స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం


