హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

తూ.గో: గోకవరం మండలం కామరాజుపేట గ్రామం సమీపంలో శుక్రవారం ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన సంఘటనలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాల సేకరిస్తున్నారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.