కోనసీమ: వైద్య ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులు శుక్రవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఆలమూరు ప్రభుత్వ ఆస్పత్రి, పెదపళ్ల, చొప్పెల్ల పీహెచ్‌సీల వద్ద మధ్యాహ్న భోజన విరామ సమయంలో ధర్నా నిర్వహించారు. తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని, సమాన పనికి సమాన వేతనం అందించాలని డిమాండ్ చేశారు. దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నల్ల బ్యాడ్జీలు ధరించి కాంట్రాక్ట్ ఉద్యోగుల నిరసన


