హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పంచాయతీరాజ్ శాఖ అధికారులతో MLA సమీక్ష

ELR: ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు శుక్రవారం తమ క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై డీ.ఈ, ఎ.ఇలతో కూలంకషంగా చర్చించారు. గ్రామాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను సత్వరమే కల్పించి, పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.