హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుపతి కమిషనర్ అసహనం

తిరుపతి నగరంలో భక్తులు, ప్రజలు అధికంగా ఉండే ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను మెరుగ్గా చేపట్టాలని కమిషనర్ ఎం.జయకృష్ణ ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం రైల్వేస్టేషన్, ఆర్టీసీ బస్టాండ్, తీర్థకట్ట వీధి, గరుడసేవ వాహనాల పార్కింగ్ ప్రాంతాల్లో పనులను పరిశీలించారు. దుకాణాల ముందు చెత్త పేరుకుపోవడంపై సిబ్బందిని మందలించి వెంటనే తొలగించాలని సూచించారు.