హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయవాడ–తిరుపతి మధ్య ప్రత్యేక రైలు

NTR: విజయవాడ–తిరుపతి మధ్య ఈ నెల 20న ప్రత్యేక రైలు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. 07606 రైలు తిరుపతి నుంచి రాత్రి 1.15 గంటలకు బయల్దేరి ఉదయం 8కి విజయవాడ చేరుతుందన్నారు. తిరుగు ప్రయాణంలో 07605 రైలు ఉదయం 8కి బయల్దేరి సాయంత్రం 4.45కి తిరుపతి చేరుతుందన్నారు. తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంటలో ఆగుతుందని తెలిపారు.