హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డిజిటల్ లావాదేవీలపై భారం వద్దు: విశ్వేశ్వర రెడ్డి

తూ.గో: ప్రజలను డిజిటల్ చెల్లింపుల వైపు ప్రోత్సహించిన ప్రభుత్వం.. అదే లావాదేవీలపై అదనపు భారం మోపడం సరికాదని కాంగ్రెస్ పార్లమెంటరీ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వర్రెడ్డి విమర్శించారు. శుక్రవారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. చిన్న వ్యాపారులు ఇప్పటికే వస్తువులపై పన్నులు చెల్లిస్తున్నారని, డిజిటల్ లావాదేవీలకు అదనపు ఛార్జీలు విధిస్తే ఎలా అని ప్రశ్నించారు.