హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దెబ్బతిన్న తోటలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే

ATP: ఆత్మకూరు మండలం సనప గ్రామంలో వీచిన భారీ గాలులకు అరటి తోటలు నేలకొరిగాయి. భాస్కర్ రెడ్డి, సూర్యనారాయణ రెడ్డితో సహా పలువురు రైతులకు చెందిన 60 ఎకరాలకు పైగా పంట దెబ్బతింది. ఎకరాకు రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టిన సమయాన పంట నాశనం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దెబ్బతిన్న తోటలను రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పరిశీలించారు.