హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేద కుటుంబాలకు CMRF భరోసా

SDPT: కోహెడ మండలం వింజపల్లిలో CMRF చెక్కులను సర్పంచ్‌ అన్నాడి శ్రీజ జీవన్‌రెడ్డి పంపిణీ చేశారు. ఐదుగురు లబ్ధిదారులకు మొత్తం రూ.1.93 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్‌ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని సర్పంచ్‌ పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు, గ్రామస్థులు ఉన్నారు.