హైదరాబాద్: 28°C
తెలంగాణ

NSUI రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అరుణ నియామకం

MBNR: అడ్డాకుల మండలం రాచాల గ్రామానికి చెందిన బ్యారం అరుణ ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం గతంలో పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న ఆమె, సంక్షేమ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేశారు. తాజా నియామకంపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ అరుణకు అభినందనలు తెలిపారు.