హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బాలసదనంలో వసతుల పరిశీలన

NGKL: అచ్చంపేట పట్టణంలోని బాలసదనం హాస్టల్‌ను జిల్లా లోకల్ బాడీ అదనపు కలెక్టర్ దేవసహాయం శుక్రవారం సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి వసతులు, సౌకర్యాలపై ఆరా తీశారు. వారికి అందిస్తున్న నైపుణ్య శిక్షణ వివరాలను సూపరింటెండెంట్‌ను అడిగి తెలుసుకున్నారు. కంప్యూటర్ డేటా ఎంట్రీ, టైలరింగ్ వంటి నైపుణ్యాలు నేర్పించాలని సూచించారు.