హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రామాభివృద్ధికి కీలక తీర్మానాలు: సర్పంచ్

MDK: ఆర్ వెంకటాపూర్‌లో సర్పంచ్ ఉమా సంజీవరెడ్డి ఆధ్వర్యంలో గ్రామసభ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పచ్చదనం-పరిశుభ్రత, గేదెలకు షెడ్ల మంజూరు, పొలాలకు మట్టి రోడ్లు, రెవెన్యూ గ్రామం ఏర్పాటుపై కీలక తీర్మానాలు చేశారు. గ్రామాభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.