NRPT: ఊట్కూర్ మండలం పెద్దజట్రం గ్రామపంచాయతీలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ నరేందర్ సూచనల మేరకు ఏఎన్‌ఎం అనంతమ్మ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ఇంటింటికీ వెళ్లారు. ఇళ్ల పరిసరాల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించి పరిశుభ్రత పాటించాలని సూచించారు. దోమల వృద్ధిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ పరిసరాలపై శ్రద్ధ వహించాలని అవగాహన కల్పించారు.
తెలంగాణ
పెద్దజట్రంలో నిల్వ నీటిపై అవగాహన


