NRPT: మక్తల్ మండలం రుద్రసముద్రం గ్రామంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు శుక్రవారం పత్రాలు పంపిణీ చేశారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఉపసర్పంచ్ వాకిటి శేషగిరి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు మంజూరు అవుతాయని వారు తెలిపారు. కార్యక్రమంలో పలు గ్రామాల సర్పంచులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పత్రాలు పంపిణీ


