హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రాజెక్టుకు వరద ప్రవాహం బంద్

GDWL: జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం పూర్తిగా నిలిచిపోయిందని ప్రాజెక్టు అధికారి సుదర్శన్‌ యాదవ్ శుక్రవారం తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 317.14 మీటర్లుగా ఉంది. 8.889 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. తాగునీటి కోసం నీటిని విడుదల చేయడం లేదని, అవుట్‌ఫ్లో నిల్‌గా ఉందని తెలిపారు.