హైదరాబాద్: 28°C
తెలంగాణ

చింతగట్టు తండాలో బొడ్రాయి ధ్వంసం

MHBD: కొత్తగూడ(M) చింతగట్టు తండాలో బొడ్రాయి ధ్వంసమైంది. రోడ్డు పనుల కోసం వచ్చిన కాంట్రాక్టర్‌కు చెందిన టిప్పర్ ఢీకొనడంతో బొడ్రాయి దెబ్బతిన్నట్లు తండావాసులు తెలిపారు. ఘటన అనంతరం బొడ్రాయికి పూజలు నిర్వహించారు. తమ గ్రామ దేవతను ధ్వంసం చేసి మనోభావాలను దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. బొడ్రాయిని పునఃప్రతిష్ఠ చేయాలని కాంట్రాక్టర్, టిప్పర్ యజమానులను కోరారు.