SDPT: నంగునూరు మండలం బద్దిపడగలో పాముకాటుతో పసుపుల సుశీల (52) మృతి చెందారు. ఇంటి పరిసరాల్లో ఆమె పనిచేస్తుండగా పాము కాటువేసినట్లు గ్రామస్థులు తెలిపారు. చికిత్స నిమిత్తం సిద్దిపేటకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు చెప్పారు. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
తెలంగాణ
పాముకాటుతో మహిళ మృతి


