హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైల్వే టెన్నిస్‌లో విఘ్నేష్‌కు గోల్డ్ మెడల్

HYD: సికింద్రాబాద్ పరిధిలోని లాలాగూడ వర్క్‌షాప్ సూపరింటెండెంట్ విఘ్నేష్ ప్రపంచ రైల్వే టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించారు. బల్గేరియాలో ఈ నెల 11 నుంచి 16 వరకు జరిగిన పోటీల్లో ప్రతిభ చాటారు. 2007 నుంచి 5 గోల్డ్ మెడల్స్, ఒక రజతం సాధించిన విఘ్నేష్‌ను దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ అభినందించారు.