హైదరాబాద్: 28°C
తెలంగాణ

విషజ్వరంతో విద్యార్థిని మృతి

WGL: పర్వతగిరి మండలంలోని గోపనపల్లికి చెందిన బోయిని నందిని (18) విషజ్వరంతో మృతి చెందింది. కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆమెకు రక్తంలో ఇన్ఫెక్షన్‌ సోకడంతో తల్లిదండ్రులు రేవతి, అనిల్‌ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నందిని మృతితో గోపనపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి.