హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలి: బాపూరావు

ADB: ఆదిలాబాద్ పట్టణానికి చెందిన మాదిగ జేఏసీ నాయకులు మాజీ ఎంపీ సోయం బాపూరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో శుక్రవారం చేరారు. వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు. గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.