హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుదాఘాతంతో రైతు మృతి

WGL: ఖానాపూర్ మండలం డబ్బిర్పేట శివారులో విద్యుదాఘాతంతో ఏనుగల్ తండాకు చెందిన రైతు భూక్యా శ్రీను శుక్రవారం మృతి చెందారు. తన మిరప తోటలో వ్యవసాయ పనులు చేస్తుండగా ట్రాన్స్‌ఫార్మర్ ఫ్యూజ్ పోయినట్లు గుర్తించి సరిచేసేందుకు వెళ్లిన శ్రీను ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందారు. ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.