కాకినాడ జిల్లా పోలీసులకు నూతన మొబైల్ ఫోరెన్సిక్ వాన్‌ను జిల్లా ఎస్పీ బిందు మాధవ్, శుక్రవారం ప్రారంభించారు. నేరస్థలాలకు నేరుగా చేరుకుని శాస్త్రీయ ఆధారాలను గుర్తించడం, సేకరించడం, భద్రపరచడం, ప్రాథమికంగా పరిశీలించేందుకు ఈ వాన్ ఉపయోగపడనుంది. డీఎన్‌ఏ, గన్‌షాట్ రెసిడ్యూ, డిజిటల్ ఆధారాల సేకరణతో పాటు అధునాతన ఫోరెన్సిక్ పరికరాలు అందుబాటులో రానున్నాయి.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మొబైల్ ఫోరెన్సిక్ యూనిట్ ప్రారంభించిన ఎస్పీ


