హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మోకాళ్లపై నిలబడి VRAల ఆందోళన

ELR: ఉంగుటూరు మండల VRA సంఘం ఆధ్వర్యంలో తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఉంగుటూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం మూడో రోజు మోకాళ్లపై నిలబడి నిరసన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా VRA సంఘం నాయకులు మాట్లాడుతూ అర్హత ఉన్నవారికి పే స్కేల్ అమలు చేయాలని, VRAల ఉద్యోగాలకు భద్రత కల్పించాలని, పెండింగ్ లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు.