హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: భక్తిశ్రద్ధలతో కుంకుమార్చన

MDK: రామాయంపేట శ్రీ వెంకటేశ్వర కాలనీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం కుంకుమార్చన పూజలు వైభవంగా సాగాయి. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారికి కుంకుమార్చన, ప్రత్యేక అర్చనలు చేశారు. కాలనీ అంతా భక్తిపారవశ్యంతో నిండిపోగా, పూజల అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు భక్తులకు ప్రసాద వితరణ చేశారు.