ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బంతిపూల తోటలు కళకళలాడుతున్నాయి. సాంప్రదాయ పంటలు వేసి నష్టపోయిన రైతులు ఈసారి పండుగ సీజనే లక్ష్యంగా ప్రత్యామ్నాయంగా బంతి సాగును ఎంచుకున్నారు. తక్కువ పెట్టుబడితోనే మంచి దిగుబడి వస్తుండటంతో రైతులకు ఆర్థికంగా కలిసొస్తోంది. మార్కెట్‌లో వివిధ రకాల బంతిపూలకు మంచి డిమాండ్ ఉండటంతో.పంట మార్పిడి ద్వారా రైతులు మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.
తెలంగాణ
బంతిపూల సాగుతో లాభాల బాటలో ఖమ్మం రైతులు..!


