హైదరాబాద్: 28°C
తెలంగాణ

శిలాఫలకం కూల్చివేత!

RR: నందిగామ మండలం మోత్కూలగూడలో గ్రామపంచాయతీ శిలాఫలకాన్ని గుర్తుతెలియని వ్యక్తులు కూల్చివేయడంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన వారిని గుర్తించి, వారిపై కఠినచర్యలు తీసుకోవాలని అధికారులను గ్రామస్థులు కోరుతున్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.