హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ భూములపై అధికారుల దృష్టి

NTR: తిరువూరులోని ఎన్ఎస్పీ ప్రభుత్వ భూముల ఆక్రమణలపై రెవెన్యూ, ఎన్ఎస్పీ అధికారులు శుక్రవారం క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. ఉద్యోగ సంఘాల సొసైటీలు అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ రెండు నెలల క్రితం కలెక్టర్‌కు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదుపై స్పందించిన అధికారులు భూమి వివరాలు, ఆక్రమణలు, నిర్మాణాల పరిస్థితిని నమోదు చేశారు.