హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పత్తి చేనులో ప్రమాదకరంగా సపోర్ట్ విద్యుత్ వైర్లు

ASF: దహెగాం గ్రామంలోని పత్తి చేనులో విద్యుత్ స్తంభాలకు సపోర్ట్‌గా ఏర్పాటు చేసిన వైర్లు సక్రమంగా బిగించక రైతులు, కూలీలు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సపోర్ట్ వైర్లను పరిశీలించి, స్టే ఇన్సులేటర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.