హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భవానీ శంకర ఆలయంలో ప్రత్యేక పూజలు

అన్నమయ్య: భాద్రపద శుక్రవారం శుక్ల సప్తమి పర్వదినం సందర్భంగా పెద్దమండ్యంలోని శ్రీ భవానీ శంకర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు మణికంఠ శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి విశేష అభిషేకం, నవగ్రహ పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకున్న భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందారు.