హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'బీఎస్ఎన్ఎల్ సేవలను వినియోగించుకోవాలి'

ADB: BSNL మొబైల్ సేవలను ప్రజల వినియోగించుకోవాలని సంస్థ అధికారి రవికుమార్ శుక్రవారం తెలిపారు. పట్టణంలోని కలెక్టర్ చౌక్‌లో వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ప్రజలకు రూ.20 కే సిమ్ కార్డును అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో సైతం మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ నెల 30 వరకు సిమ్ కార్డులను పంపిణీ చేస్తామని తెలిపారు.