హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు కారంచేడు మండల సర్వసభ్య సమావేశం

BPT: కారంచేడు మండల సర్వసభ్య సమావేశం శనివారం ఉదయం 10 గంటలకు ఎంపీపీ నీరుకట్టు వాసుబాబు అధ్యక్షతన జరగనున్నట్లు ఎంపీడీవో నేతాజీ తెలిపారు. మండల పరిధిలోని వివిధ శాఖల అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు, ప్రజా సమస్యలపై ఈ భేటీలో చర్చించనున్నారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరై తమ సూచనలను అందజేయాలని ఆయన కోరారు.