హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆస్పత్రిలో పురిటి బిడ్డ మృతి

అన్నమయ్య: మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం వేకువజామున పురిటి బిడ్డ మృతి చెందాడు. పుంగనూరుకు చెందిన సుమియా సుల్తానా ప్రసవం కోసం ఆస్పత్రిలో చేరగా, ప్రసవ సమయంలో శిశువు తల ముందుకు రాకుండా పేగు ముందుకు రావడంతో బిడ్డ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనపై ఆస్పత్రి అధికారులు పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.