హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అబ్బురపరుస్తున్న విద్యుత్ దీపాలంకరణ

కోనసీమ: అమలాపురం పట్టణంలో వినాయక నవరాత్రి మహోత్సవాల సందడి నెలకొంది. పలు ఉత్సవ కమిటీలు ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణ ప్రజలను, విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ముమ్మిడివరం గేట్ వద్ద నుంచి గడియార స్తంభం వరకు ఏర్పాటుచేసిన వినాయక మండపాలను చూడడానికి ప్రజలు తరలివస్తున్నారు. ప్రతి రోజూ సాయంత్రం అయితే చాలు విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతుంది.