ADB: ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రెండో విడతలో 750 మంది లభ్దిదారులకు రూ.5 లక్షల చొప్పున ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేయనున్నట్లు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తెలిపారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికీ 6 వేలకు పైగా ఇళ్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు. అర్హత ఉండి పథకం అందని వారికి తక్షణమే పరిశీలించి మంజూరు పత్రం అందజేస్తామని షబ్బీర్ అలీ భరోసా ఇచ్చారు.
తెలంగాణ
'జిల్లాలో 750 మందికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు'


