MHBD: గంగారం వైపు వెళ్లే ప్రధాన రహదారి పలుచోట్ల గుంతలతో ప్రమాదకరంగా మారింది. ఇల్లందు–నర్సంపేట మార్గంలో నిత్యం వాహనాల రాకపోకలు సాగుతుండగా, గుంతల కారణంగా ఇప్పటికే ప్రమాదాలు చోటుచేసుకున్నాయని స్థానికులు తెలిపారు. అయినా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రహదారికి మరమ్మతులు చేపట్టి ప్రమాదాలను నివారించాలని కోరుతున్నారు.
తెలంగాణ
గంగారం రోడ్డుపై ప్రమాదకర గుంతలు


