హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యుత్ చౌర్యానికి భారీ జరిమానాలు!

గుంటూరు టౌన్ డివిజన్‌లో అక్రమంగా విద్యుత్ వినియోగిస్తున్న వారిపై అధికారులు ఉక్కుపాదం మోపారు. ఐదుగురు చౌర్యానికి పాల్పడగా రూ.75 వేలు జరిమానా విధించారు. కేటగిరీ మార్చి వాడిన ముగ్గురికి రూ.60 వేలు, అనుమతించిన లోడ్ కంటే ఎక్కువ వాడిన 233 మందికి రూ.12.62 లక్షలు ఫైన్ వేశారు. మొత్తం రూ.13.97 లక్షల అపరాధ రుసుం వసూలు చేశారు.