హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంత్రాలతో డబ్బు రెట్టింపు చేస్తానని మోసం!

GNTR: మంత్రాలతో డబ్బులు రెట్టింపు చేస్తానని నమ్మించి గుంటూరు వాసికి ఓ కేటుగాడు కుచ్చుటోపీ పెట్టాడు. విజయవాడలో జరిగిన ఈ మోసంలో వంశీ అనే వ్యక్తి, బాధితుడి నుంచి ఏకంగా లక్ష రూపాయలు కొల్లగొట్టాడు. డబ్బులు రెట్టింపు కాకపోవడంతో మోసపోయానని గ్రహించిన గుంటూరు వాసి.. వెంటనే విజయవాడలోని మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.