హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: దుర్గం చెరువు వద్ద భారీ కొండచిలువ కలకలం

హైదరాబాద్ దుర్గం చెరువు సమీపంలోని ఐటీ కంపెనీల ముందు భారీ కొండచిలువ కనిపించడంతో అక్కడ కొద్దిసేపు కలకలం నెలకొంది. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ అక్కడికి చేరుకుని కొండచిలువను చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం దానిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. దీంతో స్థానికులు, కంపెనీల సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.