MHBD: జిల్లాలో అంగన్వాడీ టీచర్, హెల్పర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రేపటిలోగా సంబంధిత CDPO, ICDS కార్యాలయాల్లో ఒరిజినల్ ధ్రువపత్రాలతో హాజరుకావాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారి శిరీష తెలిపారు. ఒరిజినల్ ధ్రువపత్రాల రెండు సెట్ల జిరాక్స్ కాపీలు సమర్పించాలన్నారు. నిర్ణీత గడువులో హాజరుకాకపోతే గైర్హాజరుగా పరిగణించి అనర్హులుగా ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
తెలంగాణ
అంగన్వాడీ పోస్టుల దరఖాస్తుదారులకు కీలక సూచనలు


