MHBD: తొర్రూరు మండలంలోని అమ్మాపురం విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ... వ్యవసాయ పనులు కీలక దశలో ఉన్న సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో పంటలకు సాగునీరు అందించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేశారు.
తెలంగాణ
విద్యుత్ కోతలపై అమ్మాపురం రైతుల ఆందోళన


