హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూ రీ-సర్వేను వేగవంతం చేయాలి:కలెక్టర్

HNK: భూముల రీ-సర్వే ప్రక్రియను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో భూ భారతి దరఖాస్తులు, 22ఏ భూములపై సమీక్ష నిర్వహించారు. పెండింగ్ దరఖాస్తులను పారదర్శకంగా పరిష్కరించాలని సూచించారు. 22ఏ జాబితాలో భూముల చేర్పులు, తొలగింపుల్లో నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఆదేశించారు.