SRD: హత్నూర మండలం వడ్డేపల్లి జీపీని డీపీవో మల్లారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, ఇంటి పన్నుల వసూళ్ల తీరును పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇంటి పన్నులను వంద శాతం పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇందులో ఇంఛార్జ్ ఎంపీడీవో యూసుఫ్, సర్పంచ్ స్వప్నవీరేశం తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
గ్రామపంచాయతీని ఆకస్మికంగా తనిఖీ చేసిన DPO


