హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కేయూ సెక్యూరిటీ టెండర్‌ను రద్దు చేయాలి'

HNK: కాకతీయ యూనివర్సిటీ సెక్యూరిటీ టెండర్‌ను రద్దు చేసి, తెలంగాణలోని అర్హత కలిగిన ఏజెన్సీలకు అవకాశం కల్పించేలా రీ-టెండర్ నోటిఫికేషన్ జారీ చేయాలని పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు వంశీ డిమాండ్ చేశారు. టెండర్ ప్రక్రియలో అధికారులు పారదర్శకత పాటించాలని కోరారు. నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోకపోతే విద్యార్థి సంఘాలతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు.