హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: నిండిన పెద్ద చెరువు.. రైతుల హర్షం

MDK: వెల్దుర్తి మండలంలో గురువారం రాత్రి కురిసిన కుండపోత వర్షాలకు అందుగులపల్లి పెద్ద చెరువు నిండుకుండలా మారి రెండోసారి అలుగు పారింది. జలకళ సంతరించుకున్న చెరువుతో వానకాలం, యాసంగి పంటలకు పుష్కలంగా సాగునీరు అందుతుందని రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు ఇలాగే కొనసాగితే నీటి ప్రవాహం మరింత పెరుగుతుందని గ్రామీణులు తెలిపారు.