RR: అదనపు కట్నం కోసం భర్త భార్యను వేధిస్తున్న ఘటన మహేశ్వరం మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని అమీర్‌పేటకు చెందిన కిరణ్ ప్రైవేట్ ఉద్యోగి, గతేడాది శంషాబాద్‌కు చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. ఇటీవల మళ్లీ అదనపు కట్నం తీసుకురావాలని వేధిస్తుండడంతో బాధితురాలు భర్త, అతడి తల్లిదండ్రులపై శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
అదనపు కట్నం కోసం వేధింపులు.. కేసు నమోదు


