MDK: కౌడిపల్లి మండల పరిధిలోని కొట్టాల గ్రామంలో గురువారం రాత్రి ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షం పడింది. అర్ధరాత్రి సమయంలో గ్రామంలోని ఓ భారీ వృక్షంపై పిడుగు పడటంతో చెట్టు దగ్ధమైంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. వర్షంతో పొలాలు జలమయం కావడంతో ఈ సారి మంచి దిగుబడులు వస్తాయని రైతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
VIDEO: పిడుగుపాటు చెట్టు దగ్ధం


